- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంత రెచ్చగొట్టినా సహనంతోనే ఉంటాం.. మీ లెక్కలు బయటపెట్టి తీరుతాం
దిశ, డైనమిక్ బ్యూరో: యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్ గఢ్ ఒప్పందం మినహాయిస్తే కొత్తగా బీఆర్ఎస్ సర్కార్ చేసిందేమి లేదని, ఈ మూడింటిని కలిపినా వచ్చిన విద్యుత్ కేవలం 1000 మెగావాట్లు మాత్రమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం బొగ్గు లభించే ప్రాంతాల్లో పవర్ ప్లాంట్ లు పెట్టలేదని యాదాద్రి పవర్ ప్లాంట్ ఆలస్యం కావడం వల్ల అదనంగా రూ.10 వేల కోట్ల భారం పెరిగిందన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ఆలస్యం కావడం వల్ల 40 శాతం అదనంగా వ్యయం పెరిగిందన్నారు. విద్యుత్ రంగ శ్వేతపత్రంపై జరిగిన చర్చలో మాట్లాడిన భట్టి.. గత ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. విద్యుత్ శాఖలోని వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఉదయం నుంచి ఈ చర్చను తప్పుదోవ పట్టిస్తూ లెక్కలు బయటకు రాకుండా బీఆర్ఎస్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారని, మీరు ఎంత రెచ్చగొట్టినా ఆ ట్రాప్ లో పడబోమని, సభలో నిబ్బరంగా ఉండి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించుకున్నామన్నారు. వాస్తవ విషయాలు తెలియాలనే విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేశామన్నారు.
కాలువ ద్వారా నీలిస్తే బోర్లు ఎందుకు వేశారు?:
ప్రాజెక్టుల కాలువల ద్వారా నీళ్లు ఇస్తున్న మాట నిజమే అయితే రైతులు బోర్లు ఎందుకు వేస్తారు అని ప్రశ్నించారు. విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం రాత్రికి రాత్రే జరిగేది కాదని ఏ ప్రాజెక్టు ఎవరి కాలంలో నిర్మించారో ప్రజలకు తెలుసన్నారు. విద్యుత్ ప్రాజెక్టుల పూర్తికి 4 నుంచి 7 సంవత్సరాలు పడుతుందని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరసటి రోజే విద్యుత్ పరిష్కారం కాలేదన్నారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి పూర్తయ్యాయన్నారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ముందుచూపు వల్లే విద్యుత్ సమస్య తీరిందన్నారు.
విభజన తర్వాత తెలంగాణ నష్టపోకుండా సోనియాగాంధీ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారన్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పూర్తి చేసింది ఒకే ఒక్క ప్రాజెక్టు అని.. అంత దానికే తెలంగాణకు కరెంట్ మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటోందని దుయ్యబట్టారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత, రైతులు విద్యుత్ బకాయిలు రద్దు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. విద్యుత్ విషయంలో పలువురు సభ్యులు విలువైన సలహాలు ఇచ్చారు.