- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bhatti Vikramarka : కేరళలో రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమ్మేళనం.. పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి
దిశ, డైనమిక్ బ్యూరో: 16వ ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాష్ట్రాలకు న్యాయమైన వాటాలో నిధులు అందడం లేదని దీర్ఘకాలంగా వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్ అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు కేరళ రాజధాని తిరువనంతపురం లో గురువారం కాంక్లేవ్ నిర్వహించారు.
కేరళ సీఎం అధ్యక్షతన తమిళనాడు, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రాలు వసూలు చేసి కేంద్రానికి అందిస్తున్న పన్నుల ఆదాయంలో తిరిగి రాష్ట్రాలకు 41 శాతం మాత్రమే అందుతున్నదని, దీన్ని కనీసంగా 50 శాతానికి పెంచాలని పలు రాష్ట్రాలు 16వ ఫైనాన్స్ కమిషన్‌కు నివేదించాయి. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను 16వ ఫైనాన్స్ కమిషన్ సేకరిస్తున్నందున న్యాయమైన వాటకోసం ఒత్తిడి పెంచేలా పలు రాష్ట్రాలు ఈ కాంక్లేవ్‌లో పాల్గొన్నాయి.