విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి

by karthikeya |   ( Updated:2024-10-11 08:30:10.0  )
విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజల జీవితాలని, సమాజాన్ని విద్యా వ్యవస్థ పూర్తిగా మార్చగలదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. పేద విద్యార్థులకు సైతం మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని, విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడమే ఈ సమీకృత విద్యాలయాల ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని తెలిపారు.ఖమ్మం జిల్లా లక్ష్మీపురం గ్రామంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

ఆయన మాట్లాడుతూ.. ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో అన్ని వర్గాల విద్యార్థులకూ అడ్మిషన్లు అందిచడం జరుగుతుందన్న డిప్యూటీ సీఎం.. కామన్ క్రీడా ప్రాంగణం, కామన్ డైనింగ్ హాల్, కామన్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్‌ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటూ సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తి చెబుతూ అన్ని వర్గాల విద్యార్థులందరినీ కులీలకతీతంగా ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి వారి మధ్య విబేధాలు లేకుండా చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కాగా.. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహయం రఘురామిరెడ్డి, వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story