- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bhatti: కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమాపై డిప్యూటీ సీఎం భట్టి పరోక్ష కామెంట్
దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇచ్చిన భూములను గుంజుకున్న దుర్గార్గులు బీఆర్ఎస్ నేతలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) విమర్శించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో జరిగిన ఇందిరా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... గత కాంగ్రెస్ పాలకులు అసైన్డ్ చేసి, రైతులకు పంపిణీ చేసిన భూములను గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ పాలకులు బలవంతంగా గుంజుకొని, వాటిని లేఔట్ చేసి అమ్మేశారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24 లక్షల ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ మాయం అయ్యాయని చెప్పారు. 10 వేల ఎకరాలకు పైగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల రైతుల నుంచి బలవంతంగా గుంజుకున్నారన్నారు. ఆక్షన్ వేసి పైశాచిక ఆనందం పొందిన గత బీఆర్ఎస్ పాలకులకు భూ సేకరణ బాధితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 2013లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సేకరణ చట్టం తీసుకు వచ్చిందని, ఆ చట్టం ప్రకారమే రైతుల నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు తీసుకుంటామే తప్పా, మీలాగా రైతుల నుంచి బలవంతంగా భూములను తీసుకోమన్నారు.
లగచర్లలో కుట్రపూరితంగా అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారులపై భౌతిక దాడి చేయడం దారుణమన్నారు. లగచర్లలో హింసను ప్రేరేపించి దాడులకు పురిగొల్పుతున్నది బీఆర్ ఎస్ అని, కానీ తమ ప్రభుత్వం అభివృద్ధి జరగాలని చూస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను భారతీయ జనతా పార్టీ నెరవేర్చకుండా తమను విమర్శించడం దారుణమన్నారు. నోట్ల రద్దు సందర్భంగా దొంగ నోట్లు బయట పెడతామని, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని, ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని దేశ ప్రజలను బీజేపీ మోసగించిందన్నారు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ నెరవేర్చుతుందన్నారు.
ఇక దేశాన్ని అస్థిర పరుస్తూ, విభజించాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వారు ఇందిరాగాంధీ గురించి తప్పుగా చిత్రాలు తీస్తున్నారని మండిపడ్డారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఇందిరా గాంధీ జీవిత చరిత్ర గురించి తెలిసినవాళ్లు, దేశంపై అభిమానం కలిగిన వాళ్లు ఆమెను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే రాహుల్ గాంధీ ఈ దేశంలో కులగణన సర్వే జరగాలని ప్రయత్నిస్తున్నారన్నారు. దేశ ప్రజలందరికీ సమానత్వం కల్పించాలని భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, 20 సూత్రాల అమలుతో సమ సమాజా నిర్మాణానికి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పునాదులు వేసిందని అన్నారు. "నా ప్రాణం కంటే కూడా ఈ దేశం ముఖ్యం". ఈ దేశ సుస్థిరత కోసం నా చివరి రక్తపు బొట్టును కూడా ధారపోస్తానని చాటి చెప్పిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అని కొనియాడారు.
విదేశీ విధానంలో ఔనత్యాన్ని తీసుకువచ్చి ప్రపంచంలో భారత దేశాన్ని గొప్ప దేశంగా నిలబెట్టిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఇప్పటికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి కుల గణన సర్వేను సైంటిఫిక్, నిబద్ధతతో చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్, ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్, నల్లగొండ డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, చరణ్ యాదవ్, భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు.
ఇక బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణాల వల్లనే రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాళేశ్వరం తో వరి ఉత్పత్తి జరుగుతుందని చెప్పిన బీఆర్ఎస్ ది అసత్య ప్రచారమని తేలిపోయిందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72వేల కోట్లు కేటాయించామన్నారు. దేశంలో ఒకే రోజు రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసి దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన ఇందిరాగాంధీ వ్యవసాయ ప్రతిభా పురస్కారాల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి ఇండియా గుండె చప్పుడు ఇందిరా అనే పుస్తకాన్ని డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు.