పదో తరగతి ఫలితాలపై విద్యాశాఖ గుడ్ న్యూస్!

by Disha Web Desk 5 |
పదో తరగతి ఫలితాలపై విద్యాశాఖ గుడ్ న్యూస్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పదో తరగతి ఫలితాలపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఇవ్వాళ ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడించిన విద్యాశాఖ పదో తరగతి ఫలితాలు విడుదలకు రంగం సిద్దం చేసింది. ఈ మేరకు ఈ నెల 30 తేదీన ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పది ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 లక్షల మంది విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెబుతూ.. విద్యాశాఖ ఈ ప్రకటన చేసింది. కాగా తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగగా.. ఏప్రిల్ 3 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ను ప్రారంభించారు. ఈ స్పాట్ వాల్యూయేషన్ 19 కేంద్రాల్లో ఈ నెల 13 వరకు జరగగా.. ఏప్రిల్ 30న ఫలితాలు విడదల చేసేందుకు అధికారులు కసరత్తులు పూర్తి చేశారు.



Next Story

Most Viewed