- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదేళ్ల తర్వాత ప్రజాస్వామ్యం.. మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : పదేళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపిస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం ఆమె అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయం లో అసెంబ్లీ లో ప్రొటెస్ట్ చేస్తే సస్పెండ్ చేశారన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఇక తెలంగాణ ఏర్పడిందే నియామకాల మీద అని, కానీ బీఆర్ఎస్ పవర్ లో ఉన్నప్పుడు, నియామకాల మీద ఫోకస్ పెట్టలేదన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల పైనే దృష్టి పెట్టి, ప్రజలకు దూరం అయిందన్నారు. కానీ తాము చెప్పినట్లే కాంగ్రెస్ అధికారం రాగానే 30 వేల ఉద్యోగాల తో పాటు , జాబ్ నోటిఫికేషన్ లు ఇచ్చామన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆందోళనలు చేయడం హాస్యస్పదమన్నారు. పదేళ్లుగా నిరుద్యోగులు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీలో ని చిక్కు ముడులను విప్పి నియామకాలు చేపడుతున్నామన్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామన్నారు.
త్వరలోనే కొత్త పంచాయతీలు..
త్వరలోనే రాష్ట్రంలో కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. బుధవారం ఆమె అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. నూతన పంచాయతీల అంశంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇక1936లో ల్యాండ్ సర్వే చేశారని, ఆ తర్వాత ల్యాండ్ సర్వే జరగలేదన్నారు. అందుకే చాలా గ్రామపంచాయతీలు రెవెన్యూ పంచాయతీలుగా మారలేదన్నారు. గ్రామ పంచాయతీలను రెవిన్యూ పంచాయతీలుగా మార్చేందుకు రెవెన్యూ శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రతీ గ్రామంలో మల్టీపర్పస్ వర్కర్లు, పారిశుధ్య కార్మికుల వేతనల కోసం రూ. 378.88 కోట్లు విడుదల చేశామన్నారు. మారుమూల తండాల్లో రోడ్డూ, విద్యుత్ విద్యావ్యవస్థ లు సరిగా లేవన్నారు. ఇతర వర్గాల ప్రజలతో సమానంగా మారు మూల తండాల ప్రజల జీవన పరిస్థితులను మెరుగు పరుస్తామన్నారు. అక్కడ రోడ్లు, విద్యుత్, విద్య వ్యవస్థలను చక్కదిద్దుతామన్నారు. త్వరలోనే బడ్జెట్ కేటాయింపులు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1851 ఆవాస గ్రామాలు, తాండాలులు, గ్రామ పంచాయతీగా మార్చబడ్డాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర గ్రాంట్లతో సమానంగా రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్లను విడుదల చేస్తోందన్నారు. సంవత్సరానికి రూ.5 లక్షల రూపాయల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న పంచాయతీలకు అదనంగా మరో రూ.5 లక్షల రూపాయల నిధులు విడుదల చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ కార్యదర్శిని ప్రభుత్వం నియమించిందన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీ, పల్లె ప్రకృతి వనం,సెగ్రిగేషన్ షెడ్, శ్మశానవాటిక, క్రీడా ప్రాంగణంను కలిగి ఉన్నాయన్నారు. 6,176 గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు లేవని, త్వరలో నిర్మిస్తామన్నారు.
ఇది ఎన్డీఏ బడ్జెట్.. ఇండియా బడ్జెట్ కాదు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మంత్రి సీతక్క చురకలు అంటించారు. ‘ఇది ఎన్డీఏ బడ్జెట్ ..ఇండియా బడ్జెట్ కాదు’ అని ట్విట్టర్ లో విమర్శించారు. తనను బయపెట్టే బాబు, నితీష్ మీద మోడీ ప్రేమ కురిపించారన్నారు. ఏపీ కి రూ.15 వేల కోట్లు, బీహార్ కి రూ. 26 వేల కోట్లు ఇవ్వడానికి కారణం ఇదేనని వెల్లడించారు. ఇది యూనియన్ బడ్జెట్ తరహాలో లేదని, కేవలం కుర్చీ కాపాడుకునే బడ్జెట్ మాత్రమే అని వ్యంగ్యంగా విమర్శించారు.