Delivery boy scam : డెలివరీ బాయ్ స్కామ్.. ఎలా గుర్తించాలంటే? తెలంగాణ పోలీస్ ఆసక్తికర పోస్ట్

by Ramesh N |   ( Updated:2024-10-26 10:32:40.0  )
Delivery boy scam : డెలివరీ బాయ్ స్కామ్.. ఎలా గుర్తించాలంటే? తెలంగాణ పోలీస్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవాప్తంగా సైబర్ నేరాలు (Cyber Crime) రోజురోజుకు పెరుగుతున్నాయి. Telangana తెలంగాణలో సైతం సైబర్ కొంత మంది కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకుని పోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో సైబర్ నేరాలకు పాల్పడుతూ బ్యాంకుల్లో ఉన్న సొమ్మును ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక స్కామ్ గురించి Telangana Police తెలంగాణ పోలీస్ వెల్లడించింది. డెలివరీ బాయ్ స్కామ్ Delivery boy scam అంటూ ఎక్స్ x వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది.

‘మీరు ఆర్డర్ చేయకుండానే మీకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ వచ్చింది అని డెలివరీ బాయ్ వస్తే అది కచ్చితంగా స్కామ్ అని గుర్తించండి. మీ ఆర్డర్ కాదు అని చెప్పగానే, ఓటీపీ OTP అడిగితే ఎట్టిపరిస్థితుల్లోనూ మీ ఓటీపీ చెప్పొద్దు. ఇలా చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్‌లో డబ్బులు కోట్టేసే ప్రమాదం ఉంది’ అని వెల్లడించింది. జాగ్రత్తగా ఉండండని తెలంగాణ పోలీస్ హెచ్చరిస్తూ పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా మరో ట్వీట్ చేస్తూ.. మీకు తెలుసా? బ్యాంకులు మీకు OTP, KYC, PAN అప్డేట్ కోసం మిమ్మల్ని కాల్ ద్వారా, SMS ద్వారా గాని మిమ్మల్ని సంప్రదించరు.. అని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed