- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DELHI: ఈడీ కార్యాలయానికి మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు.. కవితకు పరామర్శ
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా.. కవితను ఏడు రోజుల కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ కవిత బాగోగులు తెలుసుకునేందుకు గాను ఆమె సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్, బావ మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వెళ్లారు. అనంతరం వారిద్దరూ కవితతో మాట్లాడారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు కోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకూ కవితను కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది కోర్టు. రేపు ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కవితను ఈడీ విచారించనుంది. అందుకు సంబంధించిన క్వశ్చనెయిర్ కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారని తెలుస్తోంది. కవితతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిపి ఈడీ అధికారులు విచారించనున్నారు. అదేవిధంగా విచారణకు కవిత భర్త అనిల్‌కు ఇప్పటికే నోటీసులు అందడంతో ఆయన కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది.