బీజేపీ పాలనలో వంద లక్షల కోట్లకుపైగా ఆప్పులు.. బీజేపీకి కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్

by Ramesh N |
బీజేపీ పాలనలో వంద లక్షల కోట్లకుపైగా ఆప్పులు.. బీజేపీకి కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పేదల ఆస్తుల్ని దోచుకెళ్లే స్కాంగ్రెస్ హస్తం అంతు తేలుద్దామని ఆదివారం ఎక్స్ వేదికగా బీజేపీ పార్టీ భస్మాసుర హస్తం అంటూ ట్వీట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు ఉంది బీజేపీ తీరు చూస్తుంటే అని విమర్శించింది. పదేళ్లు దేశంలో అధికారంలో ఉన్న మీరు.. వంద లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని ఆరోపించింది. దేశ ప్రజల నుంచి టాక్స్ లు, జీఎస్టీ ల రూపంలో లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారు. ఈ డబ్బులన్నీ ఏం చేశారు? ఇండియా ప్రశ్నిస్తుంది సమాధానం చెప్పండని అని నిలదీసింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయిని బలహీనం

‘మీ కార్పొరేట్ మిత్రులకు సుమారు 16 లక్షల కోట్లు రుణమాఫీ చేశారు. మీ కార్పొరేట్ మిత్రులకేమో టాక్స్ లు తగ్గించారు. సామాన్య ప్రజలకు టాక్స్ లు, నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు, వంట నూనె ధరలు పెంచారు.పేద ప్రజలు ఇచ్చే సబ్సిడీ ఎత్తేశారు. డాలర్‌తో పోలిస్తే రూపాయిని బలహీన పరిచారు. వ్యవసాయం పరికరాల పై జీఎస్టీ విధించి, వ్యవసాయంపై పెట్టుబడిని రెండింతలు చేశారు. రైతులను అప్పులు డబుల్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ కు అమ్మేశారు. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నారు..?’ అని పేర్కొంది.

5 నెలల కాంగ్రెస్ పాలన..

5 నెలల కాంగ్రెస్ పాలనలో 5 గ్యారంటీలను అమలు చేసిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పది లక్షల వరకు ఉచిత వైద్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం చేశామని తెలిపింది. 5 నెలల పాలన పై అంత విషం కక్కుతున్న మీరు.. 120 నెలలు ఈ దేశాన్ని పాలించి 2014, 2019 లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించింది.

Advertisement

Next Story