- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అగ్ని ప్రమాదంలో ఆరుగురు యువత చనిపోవడం బాధకరం: రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు యువతి యువకులు చనిపోవడం పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆరుగురు 22 ఏళ్ల వయస్సు వారేనని.. ఎంతో గొప్ప భవిష్యత్ ఉన్న యువత ఇలా మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలా వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. దక్కన్ మాల్‌లో జరిగిన సంఘటన మరువక ముందే హైదరాబాద్‌లో మరో దారుణం జరిగిందన్నారు.
ఇటీవల సికింద్రాబాద్‌లో వరుసగా అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం సరైన విచారణ, నివారణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఇటీవల కుక్కలు ఒక పసివాన్ని చంపేసాయి.. ఇప్పుడు అగ్ని ప్రమాదం ఆరుగురిని పొట్టన పెట్టుకుంది.. విశ్వ నగరం అంటూ మంత్రి కేటీఆర్ గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజల కనీస భద్రత కల్పించడం లేదని లేదని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.