- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడియం శ్రీహరిది నీచమైన చరిత్ర.. దాస్యం వినయ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కడియం కావ్య రాజీనామా లేఖ ఆశ్చర్యం కలిగించిందని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం హన్మకొండలోని పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. కడియం శ్రీహరి ఎంతో మంది బలిపశువులను చేశాడని మండిపడ్డారు. ఎవరికీ అవకాశాలు రాకుండా కుట్రలు చేసి.. ఇప్పుడు తనదారి తాను చూసుకుంటున్నాడని సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్‌లో కడియంకు ఏం తక్కువ అయందని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో ఉన్నన్నాళ్లు దళితులను ఎదగనీయకుండా చేసి.. ఇవాళ స్వార్థంతో వేరే పార్టీలోకి వెళ్లడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
కడియం శ్రీహరిని నీచమైన రాజకీయ చరిత్ర అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబును బ్లాక్‌మెయిల్ చేసి పదవులు తీసుకున్నారని ఆరోపించారు. కాగా, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.