- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking News : ఇక కొరడా ఝుళిపించనున్న తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషన్
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుండి రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ(Food Safty) అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Rajanarasimha) ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, హోటళ్లు, ఆస్పత్రులు, స్ట్రీట్‌ఫుడ్ స్టాళ్లలో రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలని ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులకు బుధవారం ఉత్తర్వులు అందాయి. అలాగే కొత్తగా 5 మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి నిర్ణయించారు. సేకరించిన శాంపిల్స్ ను ఎక్కడిక్కడ మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ లో పరీక్షలు చేసి.. తగు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారుల వివరాల ప్రకారం రాష్ట్రంలో మయోనైజ్(Mayonnaise) ను బ్యాన్ చేస్తూ ఇప్పటికే సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అన్ని రెస్టారెంట్లు, హాస్టళ్లు, హోటళ్లు, ఆస్పత్రులు, స్ట్రీట్‌ఫుడ్ స్టాళ్లలో నిబంధనలు, పరిశుభ్రత పాటించాలని.. లేదంటే సీజ్ చేయాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు.
రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని నందినగర్(Nandinagar) లో మోమోస్(Momos) లో మయోనైజ్ తిని ఓ మహిళ మృతి చెందగా.. 20 మందిదాకా ఆసుపత్రుల పాలయ్యారు. అలాగే నగరంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లలో, హాస్టళ్లల్లో, హోటళ్లలో కూడా తరుచూ ఇలాంటి ఘటనలు జగరడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల కాలంలో ప్రతిరోజూ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని వందల రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్ మీద దాడులు చేస్తూ.. భారీగా ఫైన్ విధించాయి. కొన్నిటిని సీజ్ కూడా చేశాయి. ఈ విషయాలను నేడు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వివరించగా.. తక్షణమే రాష్ట్రంలో మయోనైజ్ బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇకనుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.