నిమ్స్ డాక్టర్‌కు కుచ్చుటోపీ

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-16 06:04:33.0  )
నిమ్స్ డాక్టర్‌కు కుచ్చుటోపీ
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : ఆన్ లైన్‌లో ఎలక్ట్రికల్ చెయిర్ అమ్మటానికి ప్రయత్నించిన నిమ్స్ హాస్పిటల్ రెసిడెంట్ డాక్టర్‌కు సైబర్ నేరగాడు కుచ్చుటోపీ పెట్టాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నిమ్స్ ఆస్పత్రిలో రెసిడెంట్ డాక్టర్ ఇటీవల ఓఎల్ఎక్స్‌లో ఎలక్ట్రికల్ కుర్చీని అమ్మకానికి పెట్టాడు. ఈ క్రమంలో జితేందర్ శర్మ అనే వ్యక్తి ఫోన్ చేసి దానిని కొంటానని చెప్పాడు. కూకట్ పల్లిలో తనకు ఫర్నిచర్ షాప్ ఉన్నట్టు చెప్పాడు. డబ్బు పంపిస్తా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమన్నాడు. నమ్మిన డాక్టర్ స్కాన్ చేయగానే అతని ఖాతా నుంచి 2.58 లక్షలు కొట్టేశాడు.

Advertisement

Next Story

Most Viewed