- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cyber Crime: మొబైల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. సైబర్ క్రైమ్ పోలీసుల కీలక సూచన
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి రావడంతో క్యాష్ పేమెంట్స్ పూర్తిగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలు ఆన్‌లైన్ ద్వారా పేమెంట్స్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారు. క్యూ ఆర్ కోడ్స్, వెబ్ లింకులతో అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుని సైలెంట్‌గా చెక్కేస్తున్నారు.
మరికొందరు కేటుగాళ్లు ఎలాంటి కండీషన్లు లేకుండా లోన్లు ఇస్తామని, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మబలికి జనాలను నిండా ముంచేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రాంలోని మొబైల్ యూజర్లకు సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఆన్‌లైన్ టాస్క్‌ల పేరుతో సైబర్ చీటర్స్ అమాయకులకు వల వేస్తున్నారని పేర్కొన్నారు. స్ర్కాచ్ కార్డుల, ఆన్‌లైన్ టాస్క్‌లంటూ హడావుడి చేస్తున్నారని ఫోన్లకు వెబ్ లింకులు పంపిస్తున్నారని తెలిపారు. అన్‌నోన్ నెంబర్ల నుంచి కాల్స్, మేసేజ్‌లు వచ్చినా ఎవరూ రెస్పాండ్ అవ్వొద్దని.. వెబ్ లింకుల జోలికి వెళ్లకూడదంటూ సైబర్ క్రైం పోలీసులు సామన్య ప్రజలకు సూచనలు చేశారు.