CV Anand: బీజేపీ కార్యకర్తకు సీవీ ఆనంద్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘రిలాక్స్‌గా ఉండండి’ అంటూ సెటైర్

by karthikeya |   ( Updated:2024-11-03 14:13:19.0  )
CV Anand: బీజేపీ కార్యకర్తకు సీవీ ఆనంద్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘రిలాక్స్‌గా ఉండండి’ అంటూ సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పరిధిలో 144 సెక్షన్ విధించడంపై విమర్శలు చేసిన బీజేపీ (BJP) ఐటీ & సోసల్ మీడియా కో-కన్వీనర్ అజయ్ నాయర్ (Ajay Nair) అనే వ్యక్తికి నగర సీపీ సీవీ ఆరవింద్ అదిరే కౌంటర్ ఇచ్చారు. అసలేం జరిగిదంటే.. ఈ నెల 27వ తేదీన ఎక్స్ వేదిగకా హైదరాబాద్ సిటీ పోలీస్ ఎక్స్ హ్యాండిల్ ఓ పోస్ట్ చేసింది. అందులో హైదరాబాద్ (Hyderabad), సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలో ఎక్కడా ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడదని, ధర్నాలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించకూడని చెబుతూ సెక్షన్ 144 అమలు చేస్తున్నట్లు పేర్కొంటున్న అఫీషియల్ నోటీసులను షేర్ చేసింది. దీనిపై స్పందించిన నాయర్.. ‘‘ప్రభుత్వం భయపడుతోందా ఏంటి..? లేదా ఒకప్పటి హైదరాబాద్‌లో మారిపోతోందా..? సీవీ ఆనంద్ గారూ! జనాలు గుమికూడదంటూ 144 సెక్షన్ అమలు చేశారా..? మంచి పని చేస్తున్నారు. గ్రేట్ జాబ్’’ అంటూ 28వ తేదీన సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ పోస్ట్ షేర్ చేశాడు.

దీనిపై స్పందించిన సీపీ సీవీ ఆనంద్ (CV Anand).. ‘‘దీపావళి పండుగ వేడుకలకు, ఈ నోటిఫికేషన్‌కి ఎలాంటి సంబంధం లేదు. అనేక రకాల ఆందోళనలు, సచివాలయం (Secratariat), సీఎం నివాసం (CM House), డీజీపీ కార్యాలయం, రాజ్‌భవన్ (RajBhavan) మొదలైన వాటిపై ఆకస్మిక దాడులకు ప్లాన్ చేస్తున్న కొన్ని గ్రూపులు ఉన్నాయి. వాటి గురించి మాకు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. అలాంటి వారిని అరెస్టు చేయడం కోసం.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం ముందస్తుగా ఇచ్చిన చట్టపరమైన నోటిఫికేషన్ ఇది. ఇది దేశంలో ఎక్కడైనా సాధారణంగా జరిగే ప్రక్రియే. ఇది కర్ఫ్యూ అంటూ కొంతమంది తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. మీరు రిలాక్స్‌గా ఉండండి’’ అని కౌంటర్ ఇచ్చాడు. ఈ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే రాష్ట్ర స్పెషల్ పోలీసులు(State Special Police) ఆందోళనలు నిర్వహిస్తుండడంతో ముఖ్యమంత్రి నివాసానికి కల్పించే భద్రతపై 27వ తేదీన జంటనగరాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రానున్న నెల రోజుల పాటు ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, ఆందోళనలు జరగకుండా పోలీస్ యాక్టును అమలు చేయడంతో పాటు ఐపీసీలోని 144 సెక్షన్‌ (BNS Act Section 163)ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

Click Here For Twitter Post..

Advertisement

Next Story