అలర్ట్: గ్రూప్ 2, 3, 4 ఎగ్జామ్స్‌పై CS శాంతికుమారి కీలక ప్రకటన

by Satheesh |
అలర్ట్: గ్రూప్ 2, 3, 4 ఎగ్జామ్స్‌పై CS శాంతికుమారి కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై సీఎస్ శాంతికుమారి కీలక ప్రకటన చేశారు. జూలైలోగా గ్రూప్-2, 3, 4 రాత పరీక్షలు పూర్తి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. మంగళవారం ఆమె అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా నవంబర్ కల్లా టీఎస్ పీఎస్సీ ఆధ్వర్యంలో ఇచ్చిన నోటిఫికేషన్ల రాత పరీక్షలన్నీ పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. ఏప్రిల్‌లో పోలీస్ నియామక రాత పరీక్షలు పూర్తి చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. సెప్టెంబర్‌లోగా పోలీస్ నియామకాలు, మెడికల్, హెల్త్ సర్వీసులో ఉన్న ఖాళీలు, ఆగస్టులోగా 10వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అంతేకాకుండా గురుకుల బోర్డు ద్వారా 10వేల పోస్టులు భర్తీచేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.

Advertisement

Next Story