- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దొరల పాలన వర్సెస్ ప్రజా పాలన కేసీఆర్ పై కాంగ్రెస్ విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ (BRS) పై కాంగ్రెస్ (Congress) మరోసారి విమర్శలు గుప్పించింది. బీఆర్ఎస్ పాలన దొరల పాలన అయితే తమది ప్రజా పాలన అని విమర్శించింది. గత ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపితే తమ ప్రభుత్వం ఆయా శాఖలు పంపించిన పన్ను పెంపు ప్రతిపాదనలను తిరస్కరించిందని పేర్కొంది. ఈ మేరకు పన్నుల పెంపుపై గతంలో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్ ను తాజాగా రేవంత్ రెడ్డి పన్నుల భారం ప్రతిపాదనలను తిరస్కరించినట్లుగా తెలిసిందంటూ 'దిశ' పత్రికలో వచ్చిన కథనాన్ని కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. గతంలో కేసీఆర్ (KCR) అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రాపర్టీ ట్యాక్స్ పెంచబోతున్నామని ఈ విషయంలో మాకెలాంటి శషభిషలు లేవంటూ కేసీఆర్ మాట్లాడిన వీడియోను పోస్టు చేసింది. ఆ పక్కనే ఈ తెలంగాణను పునర్నిర్మించడంలో మా శాయశక్తుల కష్టపడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వీడియోను జతచేసి పోస్టు చేశారు.