- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే CPM లక్ష్యం: రాఘవులు
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రాబల్యం రోజురోజుకూ వేగంగా దిగజారుతున్నదని, పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో ఆ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. ఎమ్‌బీ భవన్‌లో సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ద్రవ్యోల్బణం 4.8 శాతానికి చేరిందన్నారు. కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, పాలు, పండ్ల ధరలు విపరీతంగా పెరిగాయని, టమాటా ధర రూ.150కి చేరిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకి టమాటా ధరే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. ధరల స్థిరీకరణ కోసం అన్ని రాష్ట్రాలకు డబ్బు కేటాయించి, సబ్సిడీపై నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని సూచించారు.
టోకు వ్యాపారులకు కనక వర్షం కురిపించడం కోసమే మోడీ సర్కారు ధరల నియంత్రణ చర్యలు చేపట్టట్లేదని విమర్శించారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశ్యంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లా కమిషన్ ముందు పెట్టిన ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై చర్చను లేవదీసిందని అన్నారు. మణిపూర్‌లో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి, విధ్వంసాన్ని సృష్టించిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే సీపీఐ(ఎం) ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం భావసారూప్యత కల్గిన రాజకీయ శక్తులను సమీకరించటానికి కృషి చేస్తున్నామన్నారు.