10 ఏళ్ళైనా ఇంకా పసి బిడ్డగానే తెలంగాణ: సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-06-02 10:44:47.0  )
10 ఏళ్ళైనా ఇంకా పసి బిడ్డగానే తెలంగాణ: సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పదవ సంవత్సరంలో అడుగుపెడుతోందని, అయినా ఇంకా తెలంగాణ పసి బిడ్డగానే ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. తెలంగాణ రాష్ట్రంలో అనేక వనరులు ఉన్నాయని, అయినా కూడా ఎందుకు నిరుద్యోగులు అలమటిస్తున్నారని ప్రశ్నించారు. దీని కోసం కాదుగా.. తెలంగాణ సాధించుకున్నదని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కూడా అటు ఇటు అనే ఆట అడాయని, కానీ సీపీఐ మాత్రమే తెలంగాణకు మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ స్వాముల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయి అని అనుకున్నారని, కానీ కొంత ముందుకు పోయిన తెలంగాణ ఇంకా వెనకబడి ఉందన్నారు. విభజన హామీల విషయంలో కేంద్ర బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. కృష్ణ జలాల వాటా తేల్చలేదని అన్నారు. అమరుల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదని అన్నారు. ధరణి పోర్టల్ పూర్తిగా దరిద్రపు పోర్టల్ అని విమర్శలు చేశారు. దీని వల్ల 8 లక్షల మంది రైతులు బజారున పడి తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం లో కేసీఆర్ మాన్యువల్ మెయింటైన్ చేస్తాం అన్నారు.. కానీ చేయడం లేదని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed