CPI Narayana: టికెట్ ధరల రూపంలో విమాన సంస్థలు ప్రజలను లూటీ: సీపీఐ నారాయణ

by Prasad Jukanti |   ( Updated:2024-10-29 07:30:57.0  )
CPI Narayana: టికెట్ ధరల రూపంలో విమాన సంస్థలు ప్రజలను లూటీ: సీపీఐ నారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: విమాన టికెట్ల ధరలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Cpi Narayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన సంస్థలు ప్రయాణికులను దోచుకుంటున్నాయని ఫైర్ అయ్యారు. ఈ మేరకు తాజాగా ఆయన పౌర విమానయాన శాఖ (Civil Aviation Department)కు లేఖ రాశారు. ప్రయాణ దూరం మారనప్పుడు టికెట్ ధరలు ఎలా పెంచుతారని నిలదీశారు. విమాన సంస్థలు ప్రజలను లూటీ చేస్తున్నారన్నారు. విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వస్తుంటే ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. బాంబు బెదిరింపులపై ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందిందని, దుండగులు సైకలాజికల్ టెర్రర్ కు గురి చేస్తున్నారు.

Advertisement

Next Story