- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డికి CPI నేత చాడ వెంకట్ రెడ్డి లేఖ
దిశ , తెలంగాణ బ్యూరో: సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించి వారికి వెంటనే పే స్కేల్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నామని మాజీ ఎమ్మేల్యే, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత ఎన్నికల సమయంలో ఉద్యోగాలు క్రమబద్దీకరిస్తామని హమీ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ సమగ్రశిక్షలో రోస్టర్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ రాత పరీక్షల ద్వారా జిల్లా, మండల, స్కూల్ కాంప్లెక్స్, పాఠశాల స్థాయిలలో వివిధ పోస్టులకు కాంట్రాక్టు పద్దతిన నియామకం చేపట్టడం జరిగిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్ల నుంచి 19600 మందికి పైగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. హమీలు అమలు కావకపోవడంతో ఉద్యోగలంతా నిరుత్సాహంలో ఉన్నారు. ఈ ఉద్యోగాలను క్రమబద్దీకరించి విద్యాశాఖలో విలీనం చేయడం, తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించి పే స్కేల్ ఇవ్వాలన్నారు. ప్రతీ ఉద్యోగికి జీవిత బీమా రూ.10 లక్షలు, ఆరోగ్య బీమా రూ.10 లక్షలు కల్పించాలని తదితర డిమాండ్స్‌ను పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు.