- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గెస్ట్ లెక్చరర్లను కొనసాగించండి.. సీఎం కేసీఆర్ కు సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి
దిశ , తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 1,654 మంది గెస్ట్ లెక్చరర్స్‌ను యథావిధిగా కొనసాగించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, చాడ వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. గత పది సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నా వీరిని ఉన్నాఫలంగా తొలగించడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. ప్రభుత్వం పెట్టిన మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూలు ద్వారా, త్రిమెన్ సెలక్షన్ కమిటీ ద్వారా వారందరూ ఎంపికయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇంటర్ విద్యలో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయకపోయినా పర్మినెంట్ లెక్చరర్స్‌తో సమానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం కూడా ఈ మధ్యనే ప్రస్తుతం తాత్కాలికంగా పని చేస్తున్న వారిని తొలగించకూడదని జీ.వో.నెంబర్ 1145 ద్వారా ఆదేశాలు ఇచ్చినా, ఇంటర్ బోర్డు ఏకపక్షంగా గెస్ట్ లెక్చరర్స్‌ను తొలగిస్తామని చెప్పడం అన్యాయమని పేర్కొన్నారు. ఇంతకాలం పనిచేసినా ఉద్యోగాల క్రమబద్దీకరణ లేకపోగా, వారి ఉద్యోగాలను తీసివేయడంతో తీవ్ర మానసిక వ్యధకు గురవుతున్నారని తెలిపారు. వాళ్లంతా ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎంపికైన లెక్చరర్స్ అని తెలిపారు. ప్రభుత్వ లెక్చరర్స్ కు అన్ని అర్హతలు ఉన్నవాళ్లని తొలగించడం భావ్యం కాదన్నారు. ఇంటర్ బోర్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, పాతవారిని యథావిధిగా కొనసాగించాలని అయన తన లేఖలో కోరారు.