ప్రారంభమైన సీపీఐ కార్యవర్గ సమావేశం.. ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో ఉన్నది వీరే

by Ramesh Goud |   ( Updated:2025-03-09 14:52:51.0  )
ప్రారంభమైన సీపీఐ కార్యవర్గ సమావేశం.. ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో ఉన్నది వీరే
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక (MLC Elections) నేపథ్యంలో సీపీఐ పార్టీ కార్యాలయం (CPI Party Office) అయిన మగ్దుమ్ భవన్ (Magdum Bhavan) లో సీపీఐ పార్టీ కార్యవర్గ సమావేశం (CPI Party Leaders Meeting) ప్రారంభమైంది. ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ నేతల మధ్య చర్చ జరుగుతోంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం సీపీఐ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ (Telangana)లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కోసం అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థుల జాబితాను (Candidates List) ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) సమయంలో పొత్తులో భాగంగా సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చింది.

ఈ హామీ మేరకు సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తూ.. ఏఐసీసీ (AICC) ఉత్తర్వులు (Orders) జారీ చేసింది. దీంతో ఎమ్మెల్సీ స్థానానికి ఎవరిని అభ్యర్థిని నిలబెట్టాలా అనే యోచనలో సీపీఐ పార్టీ పడింది. సీపీఐ పార్టీ తరుపున ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో నలుగురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో సీపీఐ పార్టీ లో కీలకంగా పని చేస్తున్న చాడా వెంకట్ రెడ్డి (Chada Venkat Reddy), నెల్లికంటి సత్యం (Nellikalli Sathyam), తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు (Thakkellapalli Srinivasa Rao), పల్లా వెంకట్ రెడ్డి (Palla Venkat Reddy) పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో ఎవరో ఒకరికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం దక్కవచ్చు అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed