- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Konda Surekha vs Nagarjuna: కొండా సురేఖకు షాక్.. కోర్టు నోటీసులు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha)కు కోర్టు షాకిచ్చింది. నటుడు నాగార్జున (Nagarjuna) వేసిన పరువు నష్టం దావా కేసు (Defamation Case)లో మంత్రికి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. కాగా.. నాగచైతన్య (Nagachaitanya), సమంత (Samantha)ల గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై 8వ తేదీన స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేసిన కోర్టు.. ఈ రోజు (గురువారం) విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ ధర్మాసనం ఆమెకు నోటీసులు జారీ చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా ఇదే వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కూడా కొండా సురేఖపై కోర్టుకెక్కారు. తనపై కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని, ఆమెపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాంపల్లి కోర్టు (Nampally Court)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై కూడా కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది.