- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వొద్దు.. కోర్టులో ఈడీ వాదన
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాది కోర్టులో కీలక వాదనలు చేశారు. కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా కీలక ఆధారాలను జడ్జికి ఈడీ సమర్పించింది. అప్రూవర్‌గా మారిన వ్యక్తిని కవిత బెరించినట్లు తెలిపారు. లిక్కర్ స్కాంలో కవిత కీలక సూత్రధారి అని అన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు సమధానం కూడా సరిగా చెప్పలేదని వెల్లడించారు. పది ఫోన్లలో డాటాను డిలీట్ చేసి తమకు సమర్పించారని తెలిపారు. వందల డిజిటల్ డివైజ్‌లను ధ్వంసం చేశారని అన్నారు. ఇంత చేసి కుమారుడికి పరీక్షలు ఉన్నాయని బెయిల్ కోరడం మానవతా కోణంలోకి రాదని చెప్పారు. అయినా ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయాయని గుర్తుచేశారు. ఇరువురి తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.