Cotton Cultivation: తెల్ల బంగారం సాగుకే రైతులు సై..

by Shiva |
Cotton Cultivation: తెల్ల బంగారం సాగుకే రైతులు సై..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతులు వర్షాధార పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్‌లో పత్తికి బాగా డిమాండ్‌తో పాటు మద్దతు ధర కలిసి వస్తుండటంతో ఆ పంటను వేస్తున్నారు. వాణిజ్య పంట అయినా పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో గతంలో ఎప్పుడూ లేనంతగా.. క్వింటా రూ.14 వేల ధర పలికింది. ప్రభుత్వం కూడా పత్తిసాగును ప్రోత్సహిస్తోంది. తామర పురుగుతో నష్టపోయిన మిర్చి రైతులు కూడా పత్తిసాగు వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ వానాకాలం పంట కింద 41 లక్షల ఎకరాల్లో (ఆగస్టు 7వ తేదీ నాటికి) రైతులు పత్తి సాగు చేశారని వ్యవసాయ నివేదికలో పేర్కొన్నారు. సర్కారు పత్తికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,020 ప్రకటించడంతో రైతులు భరోసాతో పంట వేస్తున్నారు. ఇప్పటికే 80శాతం వరకు విత్తనాలు వేయడం పూర్తి చేశారు. రసాయన ఎరువులు వేయడంతో పాటు పురుగు మందులు పిచికారీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 80 % మంది రైతులు పత్తి సాగువైపే ఆసక్తి చూపుతారు.

గతేడాది రికార్డు బ్రేక్

ఈ సీజన్‌లో వరి సాగు రికార్డులను తిరగరాయనున్నది. ప్రస్తుత సాగు తీరు చూస్తుంటే గతేడాదిని అధిగమించనున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25.58 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఈ నెల చివరి మాసం వరకు సమయం ఉన్నందున వరి సాగు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు ఎకరాకు రూ.500 బోనస్ ప్రకటించడంతో ఈ సారి రైతులు దొడ్డు రకం కంటే సన్నాలకే అధిక ఆసక్తి చూపుతున్నారని ఆఫీసర్లు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed