- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అద్దంకి దయాకర్ క్లారిటీ
దిశ, వెబ్డెస్క్: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో సొంత పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. ‘రాముడు మీకు చిన్నయ్యనా, సీత మీకు చిన్నమ్మనా.. మీరేమైనా రాముడి వంశంలో పుట్టారా.. వీళ్లకు అసలు హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు. రాముడు అసలు ఏం చేసిండో తెలియదు’ అని కామెంట్స్ చేశారు.
అయితే అద్దంకి దయాకర్ మాట్లాడిన వీడియోపై బీజేపీ నేతలు, పలువరు నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. హిందువులను కించపర్చేలా మాట్లాడారంటూ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. నిర్మల్ తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. అమిత్ షా, మోడీని రాజకీయంగా విమర్శిస్తే.. రాముడ అంశాన్ని తెరపైకి తెచ్చి పబ్బం గడుపుతున్నారని ఫైర్ అయ్యారు. రామభక్తుల మనోభావాలను తాను ఎప్పటికీ దెబ్బతీయను అని చెప్పారు. రాముడు అందరివాడు అని బీజేపీకి మాత్రమే దేవుడు కాదన్నారు. రామ నామాన్ని యుద్ధనినాదంగా మార్చొద్దు అని రిక్వెస్ట్ చేశారు.