HMDA నిబంధనలు తూచ్.. FTLలోనే సాయిప్రియ వెంచర్...!

by Bhoopathi Nagaiah |
HMDA నిబంధనలు తూచ్.. FTLలోనే సాయిప్రియ వెంచర్...!
X

దిశ, మహేశ్వరం: మహేశ్వరం మండలం హైదారాబాద్ నగరానికి కూతవేట దూరంలో ఉండటంతో మహేశ్వరం మండలంలోని భూముల ధరలు కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. దీంతో అక్రమార్కులు, రియల్టర్ల కన్ను సహజ సిద్ధంగా ఉన్న చెరువులను, వాగులను కబ్జాలు చేస్తూ వెంచర్లు నిర్మాణం చేస్తున్నారు. వెంచర్ నిర్మాణం చేసేటప్పుడు వెంచర్ పక్కనే చెరువు ఉంటే చెరువు శిఖం భూమిని వెంచర్‌లో కలుపుకొని ప్రహరీ నిర్మించారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 144 లో తిమ్మాయి చెరువు(మక్త చెరువు, తిమ్మాజీ చెరువు) రెవెన్యూ రికార్డుల ప్రకారం 34.05 ఎకరాలు తిమ్మాయి చెరువు ఉంది. చెరువును పక్కనే ఉన్న సాయిప్రియ వెంచర్ సర్వే నంబర్ (145,146,147,148,149) సర్వే నంబర్లల్లో సాయిప్రియ వెంచర్ ఉంది. వెంచర్ నిర్వాహకులు వెంచర్ నిర్మాణం చేసే క్రమంలో చెరువులోకి వచ్చే వాగులను మట్టితో పూడ్చి వేశారని చెరువు శిఖం భూమిలో సాయిప్రియ వెంచర్ నిర్వాహకులు ప్రహరీ నిర్మించారని, ఎఫ్‌టీఎల్ పరిధిలోనే నిర్మాణం చేపట్టారాన్ని తుమ్మలూరు గ్రామానికి చెందిన పలువురు రైతులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు చెరువు పూర్తి ఎఫ్‌టీఎల్‌ను నిర్దారించాలని, తిమ్మాయి చెరువు పై హైడ్రా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

HMDA, DTCP నిబంధనలు తూచ్...?

HMDA, DTCP వెంచర్ నిర్మాణం చేపట్టలాంటే ఇంటర్నల్ రోడ్డు 33 ఫీట్లు, అప్రోచ్చు రోడ్డు 45 రోడ్లు నిర్మాణంతో పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్, వాటర్ సౌకర్యం లాంటి వసతులు కల్పించాలి. HMDA, DTCP నిబంధనలు ఏమి పాటించకుండా ప్లాట్లను అమ్ముతున్నారు. మరో పక్క సాయిప్రియ వెంచర్‌లో HMDA ఒక బ్లాక్, DTCP బ్లాక్ నిర్మాణం చేపట్టి ప్లాట్లు అమ్ముతున్నారు.

రైతులు వెళ్లే దారి మూసివేత?

సాయిప్రియ వెంచర్ నిర్వాహకులు వెంచర్ చూట్టు ప్రహరీ, కంచే వేయడంతో(ఫెన్సింగ్)వెంచర్ వెనకాల భూములు ఉన్న రైతులు తమ పొలాలకు, చెరువు వద్దకు వెళ్లే దారి లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. తమ పొలాల్లోకి వెళ్లాలంటే వెంచర్ వారి మెయిన్ గేట్ వద్ద వెంచర్ వారి అనుమతి తీసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందంటున్నారు.

సాయిప్రియ వెంచర్ నిర్వాహకులపై చర్యలేవి

ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు తిమ్మాయి చెరువు(తిమయ్య చెరువు) పూర్తి FTL పరిధిని నిర్ధారించాలి. తిమ్మాయి చెరువు FTL పరిధిలో నిర్మాణం చేపట్టిన సాయిప్రియ వెంచర్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

-కటికల శ్రీహరి ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్, తుమ్మలూరు

Advertisement

Next Story

Most Viewed