పదేళ్లలో విద్యావ్యవస్థ నాశనం.. దుర్భర పరిస్థితుల్లో ఆడపిల్లలు

by Gantepaka Srikanth |
పదేళ్లలో విద్యావ్యవస్థ నాశనం.. దుర్భర పరిస్థితుల్లో ఆడపిల్లలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్లలో విద్యావ్యవస్థను నాశనం చేశారని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం ఆమె అసెంబ్లీలో ప్రసంగించారు. తన నియోజకవర్గంలో మెజార్టీ స్కూళ్లకు టాయిలెట్లు లేవన్నారు. ఉన్న వాటికి మెయింటనెన్స్ లేవన్నారు. ఆడపిల్లలు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారన్నారు. ఇది దారుణమన్నారు. ప్రత్యేక తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులు కనిపిస్తాయని ఊహించలేదన్నారు. ఎందుకీ నిర్లక్ష్యం జరిగిందో? బీఆర్ఎస్ చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కూళ్లన్నీ బలోపేతం అవుతాయనే నమ్మకం తనకు ఉన్నదన్నారు. ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం స్పోర్ట్స్ రంగాన్ని కిల్ చేసిందన్నారు. కోచ్‌ల నియామకాలు జరగలేదన్నారు. స్టేడియంలన్నీ అస్తవ్యస్తంగా మారాయన్నారు. బడ్జెట్ కూడా అతి తక్కువగా కేవలం సాలరీలు వరకే పొందుపరిచారన్నారు. ఫస్ట్ టైమ్ క్రీడారంగంలో అత్యధిక బడ్జెట్‌ను తమ ప్రభుత్వం సమకూర్చిందన్నారు. ఇక క్రీడాకారులకు తగిన స్థాయిలో గుర్తింపు ఇస్తామన్నారు.

Advertisement

Next Story