బీజేపీ ఎంపీలు కలిసిరావాలని కాంగ్రెస్ మహిళా నేత పిలుపు

by Gantepaka Srikanth |
బీజేపీ ఎంపీలు కలిసిరావాలని కాంగ్రెస్ మహిళా నేత పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ సునీత ముదిరాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో మూడోసారి పవర్‌లోకి వచ్చి ఈ రిజర్వేషన్ తీసుకురాలేదంటే యావత్ మహిళా లోకం ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని ఆమె నొక్కి చెప్పారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా సునీత ముదిరాజ్ మాట్లాడుతూ.. నారి న్యాయ్ హక్కు సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను వెంటనే అమలుచేయాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చి ఉంటే నారి న్యాయ్ పేరిట ఇప్పటికే 33 శాతం రిజర్వేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేవాళ్లమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అన్ని పార్టీలూ తమ పోరాటానికి మద్ధతు తెలపాలన్నారు. పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని కోరారు. హక్కుల కోసం ఏకమవుదామని ఆమె పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed