- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress: ఆ హక్కు బీఆర్ఎస్‌కి ఎక్కడిది..? విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ తల్లి(Telangana Thalli) రూపం గురించి కొట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి(BRS Party) ఎక్కడున్నది అని కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి(Congress Leader Vijaya Shanthi) ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపం గురించి కొద్ది రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ తల్లి విగ్రహ రూపం గురించి విజయశాంతి స్పందిస్తూ.. బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. 2007 సంవత్సరంలో మొదటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.. నాడు తల్లి తెలంగాణ పార్టీ(Thalli Thelangana Party) కార్యాచరణలలో భాగంగా బడుగు, బలహీన, సబ్బండ వర్గాల తల్లి ప్రతిరూపంగా బీఎస్ రాములు(BS Ramulu) చిత్రీకరణతో ఏర్పడిందని తెలిపారు.
అప్పటికి నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన బహుశా జరగలేదని, తదనంతరం టీఆర్ఎస్ (బీఆర్ఎస్), వారి టీఆర్ఎస్ ఆఫీస్ లో ఒక తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేశారని అన్నారు. కానీ, వారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో ఎన్నడూ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Government) తీరుగా తెలంగాణ తల్లి రూపానికి ఒక అధికార పూర్వక హోదా, గౌరవం, ప్రభుత్వ నిర్దేశ విధానాలు కల్పించలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ వంటి రాజకీయ పార్టీ ఆవిష్కరించిన తెలంగాణ తల్లి రూపం మార్పుపై ఆ పార్టీ కొట్లాడితే.. ఆ హక్కు వారికి ఎక్కడున్నదని నిలదీశారు. అలా అయితే తల్లి తెలంగాణ విగ్రహ రూపాన్ని బీఆర్ఎస్ మార్చిందని నాటి మన తెలంగాణా ఉద్యమకారులు కూడా కొట్లాడవచ్చని స్పష్టం చేశారు. మన బోనాలు, బతుకమ్మ సంస్కృతి తరతరాలుగా నిలిచే ఉన్నవి, ఉంటాయని, అందుకు రాజకీయ పార్టీల ప్రయోజనార్ధ ప్రమేయం ఎన్నడు ఒక ఆవశ్యకత కాదని అన్నారు. పానమెత్తుగా ప్రజలు కాపాడుకుంటూనే బతుకుతారు.. ఎప్పటికీ బతికించుకుంటారని విజయశాంతి చెప్పారు.