- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ కోతలకు నిరసనగా కాంగ్రెస్ వాకౌట్
దిశ, డైనమిక్ బ్యూరో : అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. గురువారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పద్దులపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని విద్యుత్ కోతలపై కాంగ్రెస్ నిరసనకు దిగింది. శాసనసభలో వాయిదా తీర్మాణం ప్రవేశపెట్టింది. అయితే కాంగ్రెస్ నేతలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరస్కరించడంతో కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నేతలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో సభ లోపల వెలుపల ప్లకార్డులతో నిరసన తెలిపుతూ అసెంబ్లీ నుంచి వాక్ అవుట్ చేశారు.
అసెంబ్లీ ముందు ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీ బయట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చే 4 గంటల కరెంటులోను కోత పెట్టడం దారుణం అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రైతుల సమస్యలపై గొంతుపోయేలా అరిచి, గీ పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు క్రాప్ సీజన్‌లో మాటిమాటికి కరెంటు పోతుందని ఆరోపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క నాణ్యమైన కరెంటు సరఫరా చేసి రైతులను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. కరెంట్ ఛార్జీల రూపంలో ప్రజలపై రూ. 16వేల కోట్ల భారం మోపాలని ప్రభుత్వం చూస్తోందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.