- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గవర్నర్‌తో కాంగ్రెస్ బృందం భేటీ!
దిశ, తెలంగాణ బ్యూరో : సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించిన కాంగ్రెస్ తరఫున ప్రతినిధి బృందం మరికొద్దిసేపట్లో గవర్నర్‌తో భేటీ కానున్నది. గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖతో పాటు సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకున్నట్లు ధృవీకరించే పత్రాలను గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు ఈ బృందం అందజేయనున్నది. సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో లాంఛనంగా గవర్నర్‌తో ఈ బృందం భేటీ అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరనున్నది. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా ఆమెను కోరనున్నది. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాల్సింది గవర్నర్ కావడంతో ఆమెను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి తదితరులు నేరుగా కలిసి విజ్ఞప్తి చేయనున్నారు.