కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

by Anjali |   ( Updated:2024-07-02 08:34:56.0  )
కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: నేను చేసిన సేవలను ప్రజలు మర్చిపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటిమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవి కోసం నేను అడుక్కోవాలా? అలా అడుక్కునే పదవి నాకు వద్దు అని అన్నారు. నేను పదవి లేకున్నా బతుకుతానని గొంతెత్తి చెప్పుకొచ్చారు. నేను ఓట్ల కోసం సేవ చేయనని వెల్లడించారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా నాకు ప్రజలే ముఖ్యమని పేర్కొన్నారు. కానీ సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే.. నేను ప్రజలకు ఎలాంటి సేవ చేయలేదని ప్రచారం చేశారన్నారు. దీంతో బాధేసిందని జగ్గారెడ్డి ఎమోషనల్ అయ్యారు.

ఇక ఇటీవల జగ్గారెడ్డి పీసీసీ పదవి ఎవరికి కట్టబెట్టినా తనకు అభ్యంతరం లేదని వెల్లడించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో తనకు అటెండర్ జాబ్ ఇచ్చినా.. చేస్తానంటూ జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రాబోయే పదేళ్లలో ఆయన ఏదో ఒకరోజు తప్పకుండా పీసీసీ పదవి చేపడాతనని, తెలంగాణ రాష్ట్రానికి సీఎం కూడా అవుతానని కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పిన మాటలను మాటలను ఫాలో అవుతానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.



Advertisement

Next Story

Most Viewed