- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన స్క్రీనింగ్ కమిటీ భేటీ.. కాంగ్రెస్ గెలిచే సీట్ల సంఖ్య తేల్చిచెప్పిన రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఏఐసీసీ వార్ రూమ్‌లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఇవాళ సమావేశం అయ్యింది. రెండో విడత అభ్యర్థులపై మరోసారి కసరత్తు ప్రారంభించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేసే అభ్యర్థుల జాబితాపై చర్చలు జరిపారు.
ఈ భేటీ ముగిసిన అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 80 స్థానాల్లో విజయం సాధిస్తుందని రేవంత్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. కాగా, అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ.. 55 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.