మాజీ మంత్రి DS మృతి పట్ల కాంగ్రెస్ కీలక నిర్ణయం.. సేవలను గుర్తిస్తూ అరుదైన అవకాశం..!

by Satheesh |   ( Updated:2024-06-29 10:30:31.0  )
మాజీ మంత్రి DS మృతి పట్ల కాంగ్రెస్ కీలక నిర్ణయం.. సేవలను గుర్తిస్తూ అరుదైన అవకాశం..!
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన.. శనివారం తెల్లవారుజూమున గుండె పోటుకు గురై మరణించినట్లు డీఎస్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగిన డీఎస్ మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే డీఎస్ మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ డీఎస్ పార్థివ దేహాంపై కాంగ్రెస్ పార్టీ జెండా ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, నిరంజన్ తదితరులు డీఎస్ భౌతికాయంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి నివాళులు అర్పించారు. రేపు నిజామాబాద్‌లోని ఆయన స్వగ్రామంలో డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. డీఎస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

డీఎస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సీఎస్‌ను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎస్ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఉమ్మడి ఏపీలో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పవర్‌లోకి రావడంలో అప్పుడు స్టేట్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న డీఎస్ కీలక పాత్ర పోషించారు. వైఎస్, డీఎస్ జోడీ కలిసి రెండు సార్లు రాష్ట్రంలో హస్తం పార్టీకి అధికారం చేజిక్కేలా చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కోసం విశేషంగా కృషి చేసిన డీఎస్ సేవలను గుర్తిస్తూ తాజాగా హస్తం పార్టీ పై నిర్ణయం తీసుకుంది. డీఎస్ సేవలను గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు కార్యకర్తలు, డీఎస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story