- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెరపైకి గద్దర్ ఇష్యూ! కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్.. నెటిజన్స్ విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: నియంతలం కాదు మేము.. నిబద్ధతతో పని చూసే నిజమైన ప్రజా సేవకులము అంటూ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆసక్తికర ట్వీట్ చేసింది. నియంతకి నిజమైన నాయకుడికి మధ్య తేడా ఇదంటూ బీఆర్ఎస్‌ను విమర్శిస్తూ ఓ ఫోటో షేర్ చేసింది. అందులో దొరల పాలనలో ఇలా.. అంటూ గతంలో ప్రజా భవన్ వద్ద ప్రజా యుద్ధ నౌక గద్దర్ కూర్చున్న ఫోటోను పెట్టింది. ప్రజా యుద్దనౌక గద్దర్ బతికి ఉన్నప్పుడు ఆయనను కలవడానికి కూడా సీఎం కేసీఆర్ ఇష్టపడకుండా అవమానించారని ఈ క్రమంలోనే ప్రగతి భవన్ గేట్ వద్ద ఎండలో 3 గంటలు నిలబెట్టారని ఆరోపణల వార్తను కాంగ్రెస్ పోస్ట్ చేసింది. దీంతో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల వేళ.. తెరపైకి మరోసారి గద్దర్ ఇష్యూను కాంగ్రెస్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రజా పాలనలో ఇలా అంటూ.. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారని ఫోటోలో పంచుకుంది. జూన్ 2 న జరగబోయే తెలంగాణ రాష్ట్ర వేడుకలకు హాజరుకావాలని చుక్కా రామయ్యను కలిసి శాలువాతో సీఎం రేవంత్ సత్కరించిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ ట్వీట్ పై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. పబ్లిసిటీ స్టంట్స్ ఆపి ఆరు గ్యారెంటీల హామీల అమలుపై దృష్టిపెట్టండని ఓ నెటిజన్ ఫైర్ అయ్యారు.