- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Congress: కాంగ్రెస్‌కు కొత్త సోషల్ మీడియా..? సునీల్ కనుగోలు టీమ్‌కు బాధ్యతలు
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్‌కు కొత్త సోషల్ మీడియా వింగ్ రానున్నది. ఏఐసీసీ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు టీమ్ ఇకనుంచి రాష్ట్ర పార్టీ సోషల్ మీడియా నూ నిర్వహించేందుకు అంతర్గతంగా చర్చలు జరిగాయి. రాష్ట్ర పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలన్నీ సునీల్ టీమ్ లే హ్యాండిల్ చేసేందుకు కసరత్తు జరుగుతున్నది. ఇందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక కార్పొరేట్ ఆఫీస్ సైతం తీసుకోవాలని పార్టీ ఆలోచిస్తున్నది. సీఎం అమెరికా టూర్ ముగిసిన తర్వాత కొత్త టీమ్స్ రంగంలోకి దిగే అవకాశం ఉన్నది.
ఇక ఇప్పటికే పనిచేస్తున్న పార్టీ, నేతల సోషల్ మీడియా టీమ్స్, సునీల్ కనుగోలు టీమ్స్‌కు అనుసంధానంగా వర్క్ చేయనున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి దీటుగా సోష ల్ మీడియా ఉండాలనేది కాంగ్రెస్ ఆలో చన. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కు వగా కనిపించిందనేది కాంగ్రెస్ అభిప్రా యం. తమ పార్టీ కంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా స్పీడ్ గా ఉన్నదని, అందుకే సునీల్ టీమ్స్ హ్యాండిల్ చేసేం దుకు రెడీ అవుతున్నాయని ఓ కీలక నేత వెల్లడించారు. ఇప్పటికే కీలక నేతల అభిప్రాయాలు సేకరించామని, త్వరలోనే ఈ నిర్ణయం అమలు కానున్నదని స్పష్టం చేశారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పలు ఘటనలను కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసేలా బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్స్ వివిధ ప్లాట్ ఫామ్స్ వేదికగా చిత్రీకరించిందనే అభిప్రాయంలో అధికార పార్టీ నేతలు ఉన్నారు. సీఎం రేవంత్, దానం నాగేందర్ చేసిన కాంట్రవర్సీ కామెంట్లను బీఆర్ఎస్ సోషల్ మీడియా మరింత విస్తృతంగా అధికార పార్టీకి నష్టం కలిగించేలా వాడుకున్నదని కాంగ్రెస్ నేతలు చెప్తు న్నారు. దీనికి ఖండనగా తమ పార్టీ సోషల్ మీడియా వేగంగా అందుకోలేకపోయిందని, దీని వల్ల కొంత నష్టం జరిగిందని ఓ నేత అంగీకరించారు. ఇలాంటి తప్పిదాలను భవిష్యత్తులో జరగకుండా సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో సోషల్ మీడియాను నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఇక నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసే ప్రతి దానికి కాంగ్రెస్ టీమ్స్ కౌంటర్లు ఇవ్వనున్నాయి. పొలిటికల్, అడ్మినిస్ట్రేషన్, నేతల వ్యక్తిగత అంశాలపై బీఆర్ఎస్ చేసే తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ సునీల్ టీమ్స్ ప్రచారం చేయనున్నాయి.