- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేటీఆర్ ఖబడ్దార్.. హైదరాబాద్‌లో తిరగనివ్వం’
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి కేటీఆర్‌కు మతిభ్రమించి మాట్లాడుతున్నాడని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ పిచ్చి పిచ్చి కూతలు కూస్తే, హైదరాబాద్‌లో తిరగనివ్వమని హెచ్చరించారు. మేనేజ్ మెంట్ కోటాలో వచ్చి ప్రజా నాయకుడైన సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదని నొక్కి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు.
పదేండ్లలో కేటీఆర్ ఏం చేశారో? తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నారు. కేటీఆర్ ఎవరి బూట్లు నాకుతూ, రాష్ట్రాన్ని ధ్వంసం చేశారో? పట్నం నుంచి పల్లె వరకు అందరికీ స్పష్టంగా తెలుసు అన్నారు. సీఎంపై పిచ్చి మాటలు కంటిన్యూ అయితే కేటీఆర్‌ను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పిస్తామని హెచ్చరించారు. ప్రజల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం రేవంత్ అని, బీఆర్ఎస్ నాయకులు పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తే తాటతీయడం ఖాయమని తేల్చిచెప్పారు.