- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టేజీపైనే రచ్చ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ వర్సెస్ జర్నలిస్ట్.. దశాబ్ది ఉత్సవాల వేళ ఊహించని పరిణామం
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కనివిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయాలని, ఈ వేడుకకు సోనియా గాంధీ హాజరయ్యేలా చూసి, ఉద్యమకారులను సన్మానించాలని ప్లాన్ చేస్తోంది. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కు ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరికి మధ్య గొడవ రచ్చగా మారింది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన ‘దచ్చన్న దారిలో త్యాగాల పాట’ ఆవిష్కరణ కార్యక్రమంలో వీరి మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో మహేశ్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తుండగా పాశం యాదగిరి అడ్డుకుని మహేశ్ కుమార్ చేతిలో ఉన్న మైక్ ను లాక్కున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దీంతో వేదికపై ఉన్న వారిద్దరిని ఆపేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వారిని ఒప్పుకోం:
ఈ సందర్భంగా పాశం యాదగిరి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారందరిని రేవంత్ రెడ్డి తన పక్కన పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీలో చేరికలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్క రాజకీయ నాయకుడి వల్ల రాలేదని త్యాగాల వల్లే ఏర్పాటైందని ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందువల్ల జూన్ 2న ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎవరూ వెళ్లొద్దని పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు గెలిస్తే తెలంగాణ, ఆంధ్ర మళ్లీ కలిపేందుకు ఈ కాంగ్రెస్ వాళ్లే మళ్లీ కలుపుతారేమోనని భయంగా ఉందని వ్యాఖ్యానించారు. అలాంటి సూచనలు కనిపిస్తున్నాయని, కాంగ్రెస్ నేతలను, చంద్రబాబును ఒప్పుకోమని పేర్కొన్నారు.
ఖండించిన మహేశ్ కుమార్ గౌడ్
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పాశం యాదగిరి వ్యాఖ్యలను ఖండించారు. ఉద్యమకారులను ఆదరించి సన్మానిస్తామని చెబితే రామని చెప్పడం సరైంది కాదని అన్నారు. రాజకీయ అవసరాలు వేరుగా ఉంటాయని, రాజకీయ అవసరాల కోసమే పలువురిని పార్టీలో చేర్చుకోవల్సి వచ్చిందని దానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ముడిపెట్టాలని చూడటం సరికాదన్నారు.