- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC Jeevan Reddy: ఆ క్రెడిట్ మన్మోహన్ సింగ్‌కే దక్కుతుంది
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ఏర్పాటులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర కీలకమైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మెట్రో రైల్ మొదటి దశ పూర్తి చేయడంలో మన్మోహన్ సింగ్(Manmohan Singh)కే క్రెడిట్ దక్కుతుందన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ... దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టింది మన్మోహన్ సింగ్ అని గుర్తుచేశారు. ఏకకాలంలో రైతుల రుణాలు మాఫీ చేసింది ఆయనే అని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఉపాధి అవకాశాలకు రూపకర్త కూడా ఆయనే అని వివరించారు.
పారదర్శకతకి సమాచార హక్కు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్‌దని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి మార్గం సుగమం చేసి, శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటుతో పార్టీలను బంధించినట్టు చేశారన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థను సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్లడంలో మన్మోహన్ సింగ్‌కి కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం వెంటనే భారతరత్న(Bharat Ratna) ప్రకటించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. మన్మోహన్ సింగ్‌ని గౌరవించడం అంటే పీవీ నరసింహ రావు ప్రధాన్యత ఇచ్చినట్లే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఒక్కొక్కరు ఒక్కో రంగంలో దేశాన్ని అభివృద్ధి చేశారన్నారు.