- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రీతి కేసు సిట్‌కు అప్పగించాలి.. కాంగ్రెస్ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: మెడికో ప్రీతి కేసును సిట్‌కు అప్పగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. మెడికల్‌కాలేజీల్లో వేధింపులు ఎక్కువగా ఉన్నాయన్నారు. కట్టడి చేయాల్సిన ప్రభుత్వానికి సోయి లేదన్నారు. అమాయకుల ప్రాణాలు పోతున్నా, సర్కార్‌కు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. పీజీ విద్యార్థి ప్రీతి ర్యాగింగ్ కు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నదన్నారు. సకాలంలో కాలేజ్ యాజమాన్యం, పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదన్నారు.
తండ్రి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పోలీసులు చర్యలెందుకు? తీసుకోలేదని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. వేధింపులు చేసిన సైఫ్‌ను మందలించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదన్నారు.ప్రీతి మరణం విషయంలో మట్టెవాడ పోలీస్అధికారి, కాలేజ్ప్రిన్సిపాల్, హెచ్‌వోడీని నిందితులుగా చేర్చాలన్నారు. రక్షిత అనే ఇంజనీరింగ్ అమ్మాయి కూడా వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్నారు. ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే కాలేజీల్లో వేధింపులు స్పష్టంగా తెలుస్తుందన్నారు. రక్షిత కేసులోనూ భూపాలపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. రెండు, మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక సోనియా గాంధీ రాజకీయాలకు విరామం లేదన్నారు. భారత్‌జోడో యాత్ర సఫలం అయిందన్నారు. కాంగ్రెస్‌నేతల్లో కొత్త జోష్వచ్చిందన్నారు. పార్టీ లో పదవి హోదా లేకపోయినా, గైడ్ గా ఉంటుందన్నారు. మరోవైపు బీఆర్ఎస్ఏర్పాటుతో దేశ వ్యాప్తంగా లిక్కర్‌స్కామ్‌ను పరిచయం చేశారన్నారు. బీఆర్ఎస్కు ఉన్న అవినీతి మరకలు ఆప్‌కు కూడా అంటించారన్నారు. అది ఆప్నేతలకు అర్థం కాలేదన్నారు. లిక్కర్ స్కామ్ మూలాలు వెలికితీసి నిందితులందరినీ శిక్షించాలన్నారు. బోయినపల్లి అభిషేక్‌రావు, బుచ్చిబాబు, శరత్‌చంద్రరెడ్డి మూలాలన్నీ ప్రగతిభవన్కేంద్రంగా ఉన్నాయన్నారు. సిసోడియా అరెస్ట్‌ను బీఆర్ఎస్ నేతలు ఖండించడం విచిత్రంగా కనిపిస్తుందన్నారు.