- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్యకర్తపై రెచ్చిపోయిన మానకొండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే! పెద్ద మనిషి అని చూడకుండా!
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ మిషన్-15 లో భాగంగా 15 లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రరచారంలో దూసుకెళుతోంది. సభలు, సన్నాహక సమావేశాలు, ర్యాలీలతో అభ్యర్థులు జనంలోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కార్యకర్తలతో సమావేశమవుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే కార్యకర్తపై ఫైర్ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరీంనగర్ - తిమ్మాపూర్ మండలం అలుగునూర్‌లో తాజాగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో కార్యకర్తపై మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విరుచుకుపడ్డారు. సీనియర్ సిటిజన్ అయిన కాంగ్రెస్ కార్యకర్తను బయటకు నెట్టెసే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉండగానే ఎమ్మెల్యే కార్యకర్తపై రెచ్చిపోయారు.
మంత్రి పొన్నం పక్కనుండగానే గొడవ
మంత్రి పొన్నం వారించిన కూడా స్టేజ్ నుంచి కిందకు దిగి కాంగ్రెస్ కార్యకర్తను నెట్టేశారు. దీంతో కార్యకర్తలకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం నడించింది. పలువురు ఎమ్మెల్యేకు నచ్చజెప్పడంతో గొడవ శాంతించింది. అసలు ఎమ్మెల్యే అలా ప్రవర్తించడానికి గల కారణాలు తెలియరాలేదు. కాకపోతే దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో ఎమ్మెల్యేపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
పెద్ద మనిషి అని కూడా చూడకుండా..
కాంగ్రెస్ పార్టీలో క్యాడర్‌కు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని విమర్శించారు. పెద్ద మనిషి అని కూడా చూడకుండా చేయి చేసుకుంటున్నాడని మండిపడ్డారు. కాగా, ఇటీవల కూడా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. న్యూయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కేక్ కట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే కవ్వంపల్లి.. ఓ మహిళకు కేక్ పూసేందుకు ప్రయత్నించారు. ఆ మహిళ ఇబ్బంది పడుతున్నట్లు కనిపించిన.. ఎమ్మెల్యే మాత్రం వెనక్కి తగ్గలేదు. ఐతే ఈ ఘటన సమయంలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కనే ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరుపై సర్వత్ర చర్చానీయాంశంగా మారింది.