- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుప్రీం ఎస్సీ వర్గీకరణ తీర్పు.. కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేల సమావేశం
దిశ, వెబ్ డెస్క్: గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎన్నో పోరాటాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు పవర్స్ ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. సుప్రీం కోర్టు తీర్పును దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లోనే కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మొదట ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాదిగ ఎమ్మెల్యేలు శనివారం హైదరాబాద్ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షత వహిస్తుండగా.. సుప్రీంకోర్టు తీర్పు అమలు పై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఉద్యమ నాయకులు అందరూ హాజరైనట్లు తెలుస్తుంది.