- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సోనియా గాంధీని విమర్శించే అర్హత కిషన్ రెడ్డికి లేదు’
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సోనియాగాంధీని విమర్శించే అర్హత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. స్వదేశీ నినాదం, విదేశీ వ్యాపారం చేసే కిషన్ రెడ్డి సోనియమ్మ గురించి మాట్లాడటం సరైందని కాదన్నారు. గురువారం ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క ఓటు – రెండు రాష్ట్రాలు అని కాకినాడలో బీజేపీ చేసిన తీర్మానం ఏమైందో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆనాటి UPA చైర్ పర్సన్ సోనియా గాంధీతో పాటు, కాంగ్రెస్ పార్టీది అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి రైతులను బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌరసరఫరాల కమిషనర్ చౌహాన్‌పై నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన అసత్య, నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు ఉత్తమ్ ద్వారా అనేక పదవులు పొంది ఇవాల వారినే విమర్శించడం అవకాశవాదానికి నిదర్శనం కాదా? అని బండి సుధాకర్ ప్రశ్నించారు. మహేశ్వర్ రెడ్డి తక్షణమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేస్తే సహించబోమని సుధాకర్ గౌడ్ హెచ్చరించారు.