కేసీఆర్, KTR మాట్లాడిన బూతులు దేశంలో ఏ పొలిటిషియన్ మాట్లాడలే: సంపత్

by Satheesh |   ( Updated:2024-02-05 14:07:45.0  )
కేసీఆర్, KTR మాట్లాడిన బూతులు దేశంలో ఏ పొలిటిషియన్ మాట్లాడలే: సంపత్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అసభ్య పదజాలంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను విని ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, ఆదివారం సాగునీటి ప్రాజెక్టులపై వివరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ రం.... అని అసభ్య పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ కౌంటర్ ఇచ్చారు. తిట్ల పురాణాలకు పితామహుడు కేసీఆర్ అని.. కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ మాట్లాడిన బూతులు దేశంలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదని గులాబీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే కేటీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ మరోసారి నోరు జారితే సహిందేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story