- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Sama Rammohan: బీజేపీ నేతలు నల్ల పిల్లులు.. మంచి పనికి అడ్డం పడుతున్నారు
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ నేతలంతా నల్ల పిల్లులు లాంటి వాళ్లని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఏ మంచి చేద్దామని సీఎం ప్రయత్నించినా, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలతో కాంగ్రెస్ సర్కార్‌ను శపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే పెట్టుబడులు తేవడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు విదేశీ పర్యటనలు చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే తొలి విడతలో కాగ్నిజెంట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు.
ఒకవైపు రాష్ట్ర డెవలప్ మెంట్‌కు విదేశాల్లో పెట్టుబడుల కోసం ప్రయత్నాలు, మరోవైపు రాష్ట్రంలో స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో కార్యక్రమం.. ఇలా ప్రజలు కోసం పనిచేసే ప్రభుత్వాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శించడం ఎంత వరకు కరెక్ట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, గత సర్కార్ కాకిలెక్కలతో కోట్ల రూపాయలను దోచుకున్నదన్నారు. గత సీఎం ఎప్పుడైనా పెట్టుబడులకోసం విదేశీ పర్యటన చేశారా? అని ప్రశ్నించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది రాయి వేస్తే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని ఫైర్ అయ్యారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయని వివరించారు.
కేంద్రంలోని బీజేపీ గడిచిన పదేళ్లలో ఒక్కపైసా కూడా ఇవ్వలేదన్నారు. స్కిల్ యూనివర్సిటీ పేరుతో భూదందా చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పాదయాత్ర పేరుతో వసూల్ చేస్తున్నారనే బండి సంజయ్‌ను ప్రెసిడెంట్ పోస్టు నుంచి పీకేశారన్నారు. భూ దందాలకు కేరాఫ్ బీజేపీ అని విమర్శించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కేంద్రమంత్రులుగా ఉండి ఏం లాభం? అని ప్రశ్నించారు. అమెరికాలోని తెలుగు వాళ్ళ కంపెనీలు రాష్ట్రానికి రావాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ, ఆంధ్రా అనే ఆలోచన లేకుండా సీఎం ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ప్రాంతీయ తేడాలు లేవని వివరించారు. తెలంగాణ డెవలప్‌కు ఏ స్టేట్ వాళ్లైన రావొచ్చని పేర్కొన్నారు.