- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ ఇద్దరి చీకటి ఒప్పందం బయటపడింది.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) వ్యవహారంలో బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) చీకటి ఒప్పందం బయటపడింది అని టీపీసీసీ(TPCC) మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి(Sama Ram Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి.. ఫోన్ టాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని బండి సంజయ్(Bandi Sanjay) అంటున్నారు.. ఈ కేసును పది నెలలుగా పెండింగ్‌లో పెట్టిందే సీబీఐ అని అన్నారు. ప్రధాన ముద్దాయిలు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు దేశం విడిచి పారిపోయారని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ ఇది కూడా తెలియదా? అని ఎద్దేవా చేశారు. ఏం తెలియకుండానే మీడియా ముందుకు వచ్చి అనవసర కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు.
దేశం దాటి పారిపోయిన వారిని తీసుకురావడానికి రెడ్ కార్నర్ నోటీసు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇంటర్ పోల్‌లో ఎందుకు పెట్టలేదని అడిగారు. వీటన్నింటికీ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రావుని దేశానికి తీసుక రాకుండా అడ్డుకుంది ఎవరు ? మీరు కాదా? అని అన్నారు. ప్రభాకర్ రావుని తీసుకొస్తే అసలు దోషులు బయట పడతారనే బండి సంజయ్ అడ్డుకున్నాడని కీలక ఆరోపణలు చేశారు. కేసుల నుండి తప్పించుకోవడానికి, బీజేపీకి మేలు చేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉందని అన్నారు.
Also Read..