- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్‌కు అవగాహన లేదు: రామ చంద్రారెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అందుకే క్రైమ్రేట్పెరిగిపోతున్నదని కాంగ్రెస్అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రీతిని సీనియర్ విద్యార్థి వేధించడం వలనే ఈ ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. కానీ, బీఆర్ఎస్, బీజేపీలు దీన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. ప్రీతి ఆత్మహత్య ఘటనపై వరంగల్ సీపీ నిష్పక్షపాతంగా విచారించాలని కోరారు. రాజకీయ పార్టీలకు తలొగ్గకుండా ఎంక్వైరీ చేస్తేనే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. వరంగల్ మెడికో ప్రీతి పైన జరిగిన ర్యాగింగ్‌ను కాంగ్రెస్‌పార్టీ ఖండిస్తున్నదన్నారు. తెలంగాణలో ర్యాగింగ్ ఎక్కువగా ఉందని యూజీసీ చెప్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లవ్ జిహాదీగా పేర్కొనడాన్ని ఖండిస్తున్నామమన్నారు. బండి సంజయ్‌కు స్పష్టమైన అవగాహన లేదన్నారు. ఆయన మైండ్లేకుండా మాట్లాడుతున్నాడన్నారు. నిత్యం కులాలను రెచ్చకొడుతూ వ్యవహరించడం సరికాదన్నారు. సంజయ్ సమాజాన్ని విడదీసేందుకు చేసిన వ్యాఖ్యలను సుమోటుగా తీసుకొని పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. మెడికో ప్రీతి ఘటనలో నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బండి సంజయ్ తో పాటు లవ్ జిహాద్ అని ప్రచారం చేసే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని రామచంద్రారెడ్డి పోలీసులను కోరారు.