- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పార్లమెంట్ ఎన్నికల వేళ మనసులోని మాట బయటపెట్టిన మల్లు రవి
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ సీటు ఆశించడం లేదని.. నాగర్ కర్నూలు లోక్‌సభ టికెట్ ఆశిస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న మల్లు రవి కేంద్ర హోంశాఖ అధికారులను కలిశారు. ఏపీ, తెలంగాణ భవన్ విభజన, ఆస్తుల పంపకానికి ఇరు రాష్ట్రాల అంగీకార పత్రాలను అధికారులకు అందజేసినట్లు తెలిపారు. కేంద్ర హోంశాఖ త్వరగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణ భవన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు.
అంతేకాదు.. ఎన్డీఆర్ఎఫ్ నిధులు గురించి కూడా హోంశాఖ అదనపు కార్యదర్శితో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని అధికారులు చెప్పినట్లు వెల్లడించారు. తెలంగాణ అదనపు ఐపీఎస్ అధికారుల కేటాయింపుపైనా చర్చించినట్లు పేర్కొన్నారు. త్వరలో కేంద్ర అధికారులను కలిసి తెలంగాణ పెండింగ్ అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు.